నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం కాలిఫోర్నియా లోని ఫ్రీ మౌంట్ చేరుకున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని స్థానిక బిఆర్ఎస్ ఎన్నారై టీం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.బాల్కొండ నియోజకవర్గం నుండి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు ప్రశాంత్ రెడ్డిని ఎన్ఆర్ఐ టీం సభ్యులు అభినందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై, పార్టీ కార్యక్రమాల గురించి ప్రశాంత్ రెడ్డిని ఎన్నారై టీం సభ్యులు అడిగి తెలుసుకున్నారు.