
బాధిత కుటుంబసభ్యులకు 50 కిలోల బియ్యం అందజేసి చేయూతనిచ్చిన రామన్న యువసేన సభ్యులు వల్లపు రెడ్డి రామ్ రెడ్డి ఎన్నారై. మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన పుట్ట మొగిలి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు గ్రామానికి చెందిన వల్లపురెడ్డి రాంరెడ్డి ఎన్నారై శనివారం చేయుతనందించారు. ఈ మేరకు శనివారం రామన్న యువసేన సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 50కిలోల బియ్యం అందజేశారు.కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమార్, మడి కంటి వెంకటయ్య,గంటే కృష్ణ ,పుట్ట చంద్రు ,మేడ బోయిన శంకర్, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.