తెలంగాణ బాలోత్సవ్ ఆధ్వర్యంలో అద్భుతంగా సాగిన నృత్య నీరాజనం

నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో శనివారం తెలంగాణ బాలోత్సవం  ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాటకు నృత్య నీరాజనం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బాలోత్సవ కమిటీ కె. సుజావతి సభా అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం పాటతో ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత డా|| సుద్దాల అశోక్ తేజ గారు మాట్లాడుతూ ఈ  ప్రజాపాటకు నృత్య నీరాజనం అనే కార్యక్రమం చేయాలనే  ఆలోచన వచ్చిన వారికీ మొదటగా అభినందనలు తెలిపారు.  నేను రాసిన తెలంగాణ బాలోత్సవం పాటకి ఈ చిన్నారులు చేసిన నృత్యం చాలా అద్భుతంగా ఉందన్నారు  , పిల్లల చేత ఇంత బాగా నాట్యాన్ని నేర్పించిన  నృత్య గురువు  ఇందిర పరాశరం కు అభినందనలు తెలిపారు . సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటే నాకు గుర్తుకు వచ్చేది సుజావతమ్మ , ఇంతమంది గురువులని ఒకచోట చేర్చి ప్రజా పాటలను కళారూపాకులుగా తీర్చిదిద్ది, ఇన్ని ప్రదర్శనలుకు వేదిక ఈ విజ్ఞాన కేంద్రం అవ్వటం మీ అందరి  అదృష్టం అన్నారు.  సమాజానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా  అవసరం అని చెప్పారు.  ప్రజలలో చైతన్న్యాని , పిల్లలలో సృజనాత్మకతను పెంచేవిధముగా అభ్యుదయ భావాలు కలిగిన పాటలను ఎంచుకోవటం గొప్ప విషయం అన్నారు . సినీరంగంలో అయినా పాటలు రాయటం ఆగిపోవచ్చు కానీ , ఈ బాలోత్సవం లో నేను ఎప్పుడూ  ఒక కార్మికునిగా పాటలు రాస్తూనే వుంటానని చెప్పారు.   సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ బాద్యులు ఎస్వి. నయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రజా పాట అనే ఈ కార్యక్రమం ద్వారా  సుందరయ్య విజ్ఞాన కేంద్రం పులకించింది. విజ్ఞాన కేంద్రం స్థాపించినప్పటి నుంచి నాకు తెలిసి ఇదే మొదటిసారి.  తెలంగాణ బాలోత్సవం ఎంచుకున్నటువంటి ప్రక్రియ చాలా అరుదైనది . తెలుగు భాషకు సంబంధించినటువంటి పాటలు సాహిత్యానికి సంబంధించిన పాటలు భిన్నమైన అంశాలకు సంబంధించినటువంటి పాటలు అద్భుతంగా ప్రతి ఒక్కరూ ప్రదర్శించారని చెప్పారు.   ఆత్మీయ అతిధులుగా విచ్చేసిన కళాబంధు డాక్టర్ అనూహ్య రెడ్డి గారు మాట్లాడుతూ కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ తరుపున బాలోత్సవం కమిటీకి అభినందనలు తెలియపరిచారు.  ఉదయం నుండి ఎంతో ఓపికగా ఓర్పుగా ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రజాపాటకు కూచిపూడి నాట్యం కావచ్చు భరతనాట్యం కావచ్చు ఎటువంటిపాటికైనా సరే నృత్యాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి గురువులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు.  ఆచార్య .వి . సుమిత్ర పార్థసారధి గారు మాట్లాడుతూ ప్రజా పాట అంటే ప్రజలలో నుంచి వచ్చే సాహిత్యం కానీ సంగీతం కానీ మన లో ఆలోచింపజేసేది మనలో చైతన్యాన్ని పెంచేది విచక్షణ కలగ చేసేది గతించిన కాలాన్ని తెలియజేసేది మన భవిష్యత్తుని నిర్దేశించేది ప్రజా పాట విధంగా ఉన్నదాన్ని ప్రజాపాట అంటారు. సాహిత్యంలోని భావాన్ని సాహిత్యం యొక్క విలువల్ని తెలియజేసేది ప్రజా పాట అంటూ గురువులకి, చిన్నారులకు అభినందనలు తెలియచేసారు.  తెలంగాణ బాలోత్సవం జనరల్ సెక్రటరీ ఎస్ సోమయ్య గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.  ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపడానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పారు ముఖ్యంగా ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి పిల్లలలో సైంటిఫిక్ టెంపర్ పెంచే విధంగా, రెండు మూఢనమ్మకాలు పై అవగాహన కల్పిస్తూ ,మూడు మనమంతా ఒక్కటే అనే సందేశంతో ముందుకు వెళుతుంది.  పిల్లలకు సంబంధించి సైన్స్ ఫెస్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము . వందల మంది పిల్లలు సైన్స్ కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేశారు.  వాటన్నింటినీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 24 నజరగబోయే సైన్స్ ఫెస్ట్ లో ప్రదర్శించబోతున్నారు.  పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్న ప్రతి విషయాలను కూడా త్వరలో బాలోత్సవం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకు వస్తున్నాం అని చెప్పారు.  ప్రజాపాటకు నృత్య నీరాజనం అందించిన చిన్నారులకు నృత్య గురువులకు మెమొంటోలు సర్టిఫికెట్లు మెడల్స్ ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, చినుకు సంస్థ పి. ఎన్ మూర్తి , విజ్ఞాన కేంద్రం బాధ్యులు బుచ్చిరెడ్డి, నవీన్ ,రానా,  ప్రదీప్ , గురువులు రమణి సిద్ధి, ఇందిర పరాశరం, లక్ష్మీదేవి,   రామలక్ష్మి, తేజస్విని, రేణుక, భావన దీప్తి, కళ్యాణి , శ్రీకృష్ణ,  రాధిక శ్రీనివాస్,  మాధవి శర్మ, దీప్తి , ఆకాంక్ష, రేణుక ప్రభాకర్ , మహాకల్, రమాదేవి  తదితరులు పాల్గొన్నారు.