యూనివర్సిటీలో ఎన్ఎస్ యుఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యుఐ విద్యార్థి సంఘం 54 వ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకొని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు యూనివర్సిటీ  వైస్ ప్రెసిడెంట్ సాగర్ నాయక్ జెండాను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి పాల్గొని మాట్లాడుతూ.. యూనివర్సిటీ లో విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్ ఎస్ యుఐ విద్యార్థి సంఘం ముందు ఉంటుందని, విద్యార్థి జీవితంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలంటే యూనివర్సిటీ ల్లో విద్యార్థి సంఘాలను ప్రోత్సహించాలని, నిరంతరం సమగ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి  పాటు పడాలని సూచించారు. అంతకు ముందు యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ-వైస్ ప్రెసిడెంట్ సాగర్ నాయక్ మాట్లాడుతూ..  ఇందిరాగాంధీ  1971/ఏప్రిల్/09 న నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించరని, ఈ విద్యార్థి సంఘం  ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయం,  ప్రజాస్వామిక విలువలను పరిరక్షించడం ఈ 54 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో విద్యార్థుల సమస్యల పైన అలుపెరుగని కృషి చేస్తూ అధికారంలో ఉన్నా లేకున్నా సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చుపిందని వివరించారు.  అంతిమ లక్ష్యం  విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమేనని, యూనివర్సిటీ లోని అనేక విద్యా రంగా  సమస్యల పరిష్కారనికి  కృషి చేసిందన్నారు. ముఖ్యంగా విద్యారంగం మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేయడం,  యూనివర్సిటీలోని విద్యా రంగ సమస్యల పైన కృషిచేస్తూ అనునిత్యం ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కమిటీ నాయకులు మహేష్ ,రాజేందర్, మంద నవీన్,కుశ కుమార్,శ్రీను రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.