అంతర్జాతీయ సదస్సుకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త రవీందర్ రెడ్డి ఎంపిక..

NSS coordinator Ravinder Reddy has been selected for the international conference.నవతెలంగాణ – డిచ్ పల్లి
ఒడిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ లో ఈనెల 14-18 మధ్యలో జరిగే అంతర్జాతీయ యువజన సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ఎంపిక చేసినట్టు డాక్టర్ సంగ్రామ్ కేసరి సమoద్ రామ్( ప్రాజెక్టు ప్రైవేట్ చైర్ పర్సన్ ) గురువారం సమాచారం పంపించారు. పశ్చిమ ఒడిస్సాలో టూరిజం అభివృద్ధి అవకాశాలు, యువకులు పాత్ర ప్రధాన ఆధారంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో 22 దేశాలు 28 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిట ప్రాంతాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు టూరిజం అభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాల కల్పన అనే చర్చ గోష్టి లో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హ్యూమన్ డ్యాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIm) డేప్రా బాంగ్ నవ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సంస్థల ప్రాంతాలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ని తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి, ఇతర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ,రిజిస్ట్రార్ లకు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.