మోహన్ భగవత్‌పై పోలీసు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ విద్యార్థి నాయకుల డిమాండ్! మన స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలను అవమానిస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ రామ మందిర ప్రతిష్ఠాపన సమయంలోనే భారతదేశం”నిజమైన స్వాతంత్ర్యం”సాధించిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారని.సంఘ్ యొక్క పునర్మార్పిడి చర్యలు లేకుండా ఆదివాసీలు “దేశ వ్యతిరేకులు”అనే అతని వ్యాఖ్యలు వారి గౌరవంపై దాడి చేస్తాయి, మత అసహనాన్ని ప్రోత్సహిస్తాయి అని కాబట్టి భగవత్ దేశద్రోహ చర్యలపై మరియు విద్వేషాన్ని ప్రోత్సహించడం మరియు మన ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం కోసం ఆయనపై పోలీసు ఫిర్యాదులు చేయాలని ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ నాయకులందరినీ కోరరు. రాజ్యాంగాన్ని, జాతీయ సమగ్రతను కాపాడుకోవడానికి ఐక్యంగా నిలబడదాం అని యడవల్లి వెంకటస్వామి, ప్రెసిడెంట్, ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ ఆదేశాల మేరకు బుధవారం ఎన్ఎస్ యుఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో మోహన్ భగవత్‌పై పోలీసు చర్యలు తీసుకోవాలని భీంగల్ ఎస్సై మహేష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూ ఐ విద్యార్థి నాయకులు విజయ్, వెంకీ, రుచిత కుమార్ భార్గవ్ రాజ్, తిరుమల వరుణ్, నిశాంత్ ఎన్ ఎస్ యు ఐ యువకులు,తదితరులు పాల్గొన్నారు.