ఘనంగా ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గాంధారి
ఎన్ ఎస్ యూ ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు  సర్ధార్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ యూ ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అలాగే ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్బంగా  సర్ధార్ నాయక్  మాట్లాడుతూ మన దేశ భవిషత్తును రూపొందించడంలో విద్యార్థుల పాత్ర ముఖ్యమని వారు అన్నారు. 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్యంలో ఎన్ఎస్ యూ ఐ ఏర్పడిందని ఇందులో పని చేసిన చాలా మంది నాయకులు జాతీయస్థాయికి ఏదిగరన్నారు. విద్యార్థుల సంక్షేమం హక్కు కోసం నిరంతరం పోరాడుతుందని రాహుల్ గాంధీ  దేశ ప్రధాని చేయటమే ఎన్ ఎస్ యూ ఐ ద్వే్యంగా ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం  నాయకులు సాకారం, దేవి సింగ్, రాందాస్, గంగారాం ,సిత్రం, బలరాజ్,వినోద్,సంతోష్ ,ప్రశాంత్, సాయిరాం,రమేష్, రజినీకాంత్, సమేర్ ,రాజు,శ్రీనివాస్, భిల్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.