భీంగల్ పట్టణానికి చెందిన 60 సంవత్సరాల మహిళ జుబేదా గత రెండు సంవత్సరాలుగా చెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన జుబేదా, కుటుంబం చికిత్స చేయించలేక సతమతమవుతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్,భోజ రాజు పుప్పాల విశాల్ సుంకరి సురేష్ తదితరులు తక్షణ సహాయంగా రూ.5500/- రూపాయలు జుబేదా కు అన్దించడం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ జుబేదా దీనస్థితిని అర్థం చేసుకొని దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు.అలాగే జుబేదా విషయాన్ని కాంగ్రెస్ జిల్లా నాయకులకు తెలియజేసి ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం అందేలా ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు ..ఈ కార్యక్రమం లో అరవింద్, రహీల్, అభినవ్, రుమాన్ తదితరులు పాల్గొన్నారు.