అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ యూఐ

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రయివేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను నిరోధించి నిబంధనలకు విరుద్ధంగా  పుస్తకాలను అమ్ముతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారము జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో జగన్ మోహన్ ప్రసాద్ కి ఎన్ ఎస్ యు ఐ యాదాద్రి భువనగిరి కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వివిధ పేర్లతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, పాఠ్యపుస్తకాలు, ఇతర వస్తువులను అధిక ధరలకు విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి విక్రయిస్తున్నారని,  దీనిపై ప్రభుత్వ అధికారులు చట్ట విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై ప్రత్యేక నిఘా పెట్టి వసూళ్లకు పాల్పడిన పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎన్ ఎస్ యు ఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి ఎండి. మసూద్, అసెంబ్లీ అధ్యక్షులు బోల్లేపల్లి వినయ్, భువనగిరి మండల అధ్యక్షులు ఉపేందర్ గౌడ్, పట్టణ కార్యదర్శులు ఎండి అసద్, కార్తీక్ లు ఉన్నారు.