దుప్పట్లు పంపీణీ చేస్తున్న ఎన్ టీ పీ సి దీప్తి మహిళా సభ్యులు

– అల్లూరులో వృద్దులకు దుప్పట్ల పంపిణీ 
– అల్లూరు లో మినరల్ వాటర్ ప్లాంట్,పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి..18వ డివిజన్ కార్పొరేటర్ బాధే అంజలీదేవి 
నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ అల్లూరు గ్రామంలో దీప్తి మహిళ సమితి ఎన్ టీ పీ సీ,రామగుండం వారి సహకారంతో అల్లూరులోని 100 మంది వృద్దులకు శనివారం గ్రామంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాదె అంజలీదేవి మాట్లాడుతూ ఎన్ టీ పీ సి ప్రభావిత గ్రామమైన అల్లూరుకు సంస్థ మరింత సహకారం అందించాలని అల్లూరు ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మించాలని,గ్రామంలో నీటి ఎద్దడి సమస్య ఉన్నందున మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించాలని,సీసీ రోడ్లు నిర్మించాలని వారిని కోరారు.దీప్తి మహిళా సమితి ప్రెసిడెంట్ చిన్మయి దాస్ మాట్లాడుతూ అల్లూరు అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రెసిడెంట్ చిన్మయి దాస్ ని కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ ఆరెళ్లి సత్యనారాయణ గౌడ్ తో కలిసి కార్పొరేటర్ బాధే అంజలీదేవి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి ప్రెసిడెంట్ చిన్మయి దాస్,వైస్ ప్రెసిడెంట్ ఉర్జా దేశాయి, వెల్ఫేర్ ఇంచార్జ్ పద్మశ్రీ వేముల, బాల భవన్ ఇంచార్జ్ మంజులా రెడ్డి, జీ ఎస్ సుహాసిని, మంజులా రావు,సూర్య ప్రభ కమిటీ మెంబర్స్, కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానము డైరెక్టర్ ఆరెల్లి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.