ఎన్టీఆర్‌ సహృదయుడు

– పద్మ భూషణ్‌ డాక్టర్‌ పీ.సుశీల
నవతెలంగాణ-కల్చరల్‌
సినీమా లలో ఎన్‌. టీ.ఆర్‌ వేసినన్ని పౌరాణిక పాత్రలు సినీ చరిత్రలో మారే నటుడు ఇప్పటి వరకూ చేయలేదని ఆయన సహృదయుడు ప్రతిభ ను గుర్తిస్తారని విఖ్యాత గాయని పద్మ భూషణ్‌ డాక్టర్‌ పీ.సుశీల అన్నారు. రవీంద్రభారతి ప్రధాన వేదిక పై బృందావనం సాంస్కృతిక సంస్థ నిర్వహణ లో విఖ్యాత నటులు డాక్టర్‌ నందమూరి తారక రామా రావు శత జయంతి ఉత్సవం సంగీత భరితంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌. టీ.ఆర్‌, బాల సుబ్రహ్మణ్యం, సుశీల, జానకి పాటలను బాలు ఆర్కి ష్ట్రా బృందం తో రాము,విపంచి, అమీన్‌ పాషా, సురేఖ,నిత్యసంతోషిణి, ప్రశాంతి,చోప్రా, తదితరులు మధురం గా గానం చేశారు డాక్టర్‌ పీ.సుశీల ను విదేశీ ఆంధ్రులు శ్రీనివాస్‌ చి మాట, శ్రీరామ్‌ సుంకరి, చందు,వీర బాబు తదితరులు సత్కరిం చారు. సుబ్బు కోట ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సుశీల మాట్లాడుతూ పాడుతూ తీయగా ఈటీవీ కార్యక్రమం తో బాలు ఎందరో గాయకులను వెలుగు లోకి తెచ్చారని అన్నారు. ప్రపంచం లో ఎక్కడో అక్కడ ఘంటసాల బాలు పాటలు వినిపిస్తూ వుంటాయని పేర్కొన్నారు.