
తెలుగు ప్రజలలో గుండెల్లో గుడి కట్టుకున్న మహానీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 29వ వర్దంతిని పురస్కరించుకుని శనివారం నందమూరి యువసేన నాయకులు మాజీ వార్డు మెంబర్ దేప శ్యాం సుందర్ ముదిరాజ్ చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతికి, తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం, కోసం కృషి చేసిన మహనీయులు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు ఒక శక్తి అని పేర్కొన్నారు. తెలుగువాడి విశ్వరూపం.వెండితెరపై రారాజుగా వెలుగొందారు, మహానాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాణించారని శ్యాంసుందర్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ నివాళులు అర్పించిన వారిలో సిలివేరు బిక్షపతి, రాచర్ల ఈశ్వర్, గుండ్ల లింగస్వామి, సత్యబోయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.