తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్…

The person who spread the fame of Telugu to the world is NTR... మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్పవ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్ టీఆర్) అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఎన్ టీఆర్ 23వ వర్ధంతిని పురస్కరించుకుని డిచ్ పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్ టీఆర్ విగ్రహాన్ని పునఃప్రారంభించారు. ఎన్ టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్ టీఆర్ అన్నారు. సీని హీరోగా, రాజకీయ నాయకుడిగా బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ అజార్ కిషన్ రావు,ఈదర పిచ్చయ్య, రావుల బ్రహ్మానందం, నాయుడు అంజనేయులు, నాని, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, నాగార్జున, సొసైటీ ఛైర్మన్ రామకృష్ణ, పద్మారావు, మురారి, గడగొట్టు రమేష్, సాయిబాబా, మండవ రాజా,  ననేష్, శ్యాంరావు, మండవ నళిని, ఈదర కస్తూరి, ఉమ, కార్యదర్శి బాలకృష్ణ,ఎన్ టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.