ఆయ్‌.. ట్రైలర్‌ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది

Ai.. NTR liked the trailer very muchజీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ నుంచి రాబోతున్న లేటెస్ట్‌ మూవీ ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో మెప్పించిన నార్నే నితిన్‌ హీరోగా, నయన్‌ సారిక జంటగా నటించారు. అంజి కె.మణి పుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 15న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా హీరో నార్నే నితిన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– మంచి ఫన్‌ ఉన్న గోదావరి బ్యాక్‌ డ్రాప్‌ మూవీ వచ్చి చాలా కాలమైంది. కచ్చితంగా ఆడియెన్స్‌ ఎంజారు చేస్తారని నమ్ముతున్నాం. దర్శకుడు అంజి కె మణిపుత్ర అమలాపురం కుర్రాడు. ఆయనకున్న ఫ్రస్టేషన్స్‌, లైఫ్‌లో ఆయన చూసినవన్నీ కలిపి చేసిన సినిమానే ‘ఆయ్‌’.
– ఎన్టీఆర్‌ ట్రైలర్‌ చూశారు. ఆయనకు కామెడీ బాగా నచ్చింది. ఎంజారు చేశారు. సినిమా చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి అలాంటి రెస్పాన్స్‌ వస్తే బావుంటుం దనిపిస్తుంది.
– రామ్‌ మిర్యాల మూడు పాటలకు సంగీతాన్నిస్తే.. అజయ్‌ అరసాడ రెండు పాటలకు మ్యూజిక్‌ ఇస్తూ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. మ్యూజిక్‌ సినిమా సక్సెస్‌లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. హీరోయిన్‌ నయన్‌ సారిక మరాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. తన పాత్ర అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది.
– కులం, మతం కంటే స్నేహం చాలా గొప్పది. అంత కంటే గొప్ప విషయమేదీ ఉండదనే మెసేజ్‌ను ఈ సినిమాలో ఇస్తున్నాం. ‘మ్యాడ్‌’ సీక్వెల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్‌ ఉండొచ్చు.