ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, ఎన్.టి.ఆర్ ఇంటర్నేషనల్ క్యారికేచర్, పోయెట్రీ అవార్డులు, సేవ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని జింఖానా క్లబ్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి కె.పద్మ నాభయ్య, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత అట్లూరి నారాయణరావు, భగీరథ, ఇన్ కంటాక్స్ కమీషనర్ జీవన్ లాల్ తదితరులు పాల్గొన్నారు గజల్ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్.టి.ఆర్ సెంటినరీ సెలెబ్రేషన్స్ కమిటీ కన్వీనర్ అట్లూరి నారాయణ రావు, భగీరథ అతిథులకు తమ కమిటీ ప్రచురించిన ‘శకపురుషుడు’, ‘ఎన్.టి.ఆర్ శాసన సభ ప్రసంగాలు’, ‘ఎన్.టి.ఆర్ .చారిత్రిక ప్రసంగాలు’ పుస్తకాలను బహూ కరించారు ఈ సందర్భంగా కె.పద్మనాభయ్య మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ తెర మీద పోషించిన శ్రీరాముడు, శ్రీకష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, మహా విష్ణువు పాత్రలతో ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు. నేను కూడా ఆయన్ని అదే దష్టితో చూస్తాను’ అని తెలిపారు. నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ, ‘రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.
ఆ ఘనతఎన్టీఆర్‌దే..
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ సొంతమని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని నటుడు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని, ‘కలయిక ఫౌండేషన్’ అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహిం చింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం జరిగింది. రెండు విభాగాల్లో ప్రధములుగా నిలిచిన వారికి లక్ష రూపాయల చొప్పున, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల
నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి, విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిథులుగా పాల్గొని, ‘కలయిక ఫౌండేషన్’ అధినేత చేరాల నారాయణ నిర్వహిస్తున్న కార్యక్రమాల తీరును అభినందించారు.