
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని అచ్చంపేటలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు వేపూరి వెంకటరమణ మాట్లాడారు. రాజకీయాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో గ్రామీణ ప్రాంత పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించి పేదల ఆకలి తీర్చార ని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణం టిడిపి అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తిరుపతయ్య, మండల జనరల్ సెక్రెటరీ పాండు, ఎస్టీ సెల్ అధ్యక్షులు కొర్ర బాల్య, సీనియర్ నాయకుడు కృష్ణయ్య, బుగ్గయ్య గౌడ్, తిరుపతయ్య ఉన్నారు.