– శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
– ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్‌తో కలిసి ఆవిష్కరించిన స్పీకర్
నవతెలంగాణ-దుండిగల్
దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దివంగత ఎన్టీ రామా రావు శత జయంతిని పురస్కరించుకుని దుండిగల్ మున్సిపాల్టీ బహదూర్‌పల్లి చౌరస్తా రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, దేశంలోనే మొట్ట మొదటిగా సంక్షేమ పథకాలను వారే ప్రవేశ పెట్టారని అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు రూ.2కే బియ్యాన్ని అందించిన గొప్ప ప్రజా సంక్షేమ నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. నటుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ప్రజలకు వారు అనేక సేవలు అందించారన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నాయక త్వంలో 18 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక వ్యక్తి తనేనని స్పీకర్ పేర్కొ న్నారు. ఎమ్మెల్యే కేపి వివేకా నంద్ పుత్ర సమానుడని, అసెంబ్లీలో చక్కటి భాషతో తన వాణిని గట్టిగా వినిపిస్తాడని అన్నారు. బహదూర్ పల్లి చౌరస్తాలో చక్కటి స్థలాన్ని ఇచ్చి విగ్ర హాన్ని ప్రతిష్టించిన కృష్ణారావు, ఆర్గనైజేషన్ వారికి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఎన్టీఆర్ జీవితం నిలిచిందన్నారు. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభా వం ప్రజల హదయాలలో చెరగని ముద్ర వేసిందని, రాజకీయ చైతన్యం, రాజకీయంలో నాయకులు ఎలా నడుచుకోవాలని చూపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్ భరత్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవి శంకర్, మాజీ కౌన్సిలర్ రంగారావు, వీరబాబు, రామకృష్ణ, దిలీప్, అజరు, నరేందర్, నర్సింహా రావు, బాబి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ
ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ పాల్గొన్నారు. వారితో పాటు వైస్ చైర్మెన్ పద్మారావు, కౌన్సిలర్లు భారత్ కుమార్, ఆనంద్ కుమార్, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, మాజీ కౌన్సిలర్ రంగ రావు, మున్సిపల్ యూత్ అద్యక్షులు మైసిగారి శ్రీకాంత్, నాయకులు ప్రేమ కుమార్, మధు సుధన్ రావు, కతల రాము కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకుల నివాళి
ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొలను లీడర్ నరసింహారెడ్డి, యువ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ లు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.