నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన ఇరుమాది రామిరెడ్డి అనే ఆదర్శ రైతు సాగుచేసిన నూజివీడు సీడ్స్ వారి ఆధ్ ఎన్ సీ ఎస్ 1134 అనే పత్తి రకం పై ఆదివారం కంపెనీ ప్రతినిధి ఏండీఓ బాలకృష్ణ యాదవ్ క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆధ్య అనే పత్తి వంగడం అన్ని రకాల చీడ పీడలను తట్టు కొనే శక్తి కలిగి వుంటుందని, ఈ రకం పత్తి వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తి ఉంటుందని అన్నారు. అలాగే గులాబి రంగు పురుగు ఉదృతి నుండీ తప్పించుకొని మొదటి కోతలోనే 80 శాతం పత్తి తీసుకోవడానికి అనుకూలంగా ఉండి అధిక దిగుబడి వస్తుండని తెలిపారు. ఈ కార్యక్రమం లో స్థానిక డిస్ట్రిబ్యూటర్ కోటేశ్వర్రావు రైతులు సాంబయ్య,ముత్యాలు,వెంకన్న, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాలయ్య అదేవిధంగా చుట్టూ పక్కల గ్రామాలనుండి రైతులు పాల్గోన్నారు.