రాష్ట్రస్థాయి షూటింగ్ బాలు కు ఎంపికైన నూకలమర్రి యువకులు..

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భుక్య రిత్విక్, గోగులత్ సాయి చరణ్ లు మంగళవారం హైదరాబాదులోని దోమలగూడ కాలేజీలో సౌత్ జోన్ రాష్ట్రస్థాయి షూటింగ్ బాలుకు ఎంపిక కావడం పట్ల రూరల్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పొత్తూరు నరేష్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొత్తూరు నరేష్ మాట్లాడుతూ నూకలమర్రి గ్రామం నుండి క్రీడల్లో రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో క్రీడల్లో ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థులు ఉండడం గర్వకారంగా ఉందని అన్నారు. రూరల్ మండలాల విద్యార్థులు క్రీడల్లో రాణించి వేములవాడకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నరేష్ ఆకాంక్షించారు.