ధర్నాను జయప్రదం చేయాలి: నుకారి అశోక్

Dharna should be defeated: Nukari Ashokనవతెలంగాణ – శాయంపేట
ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న గుడిసె వాసులకు శాశ్వత పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నా కార్యక్రమానికి గుడిసెవాసులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి అనుకారి అశోక్ గురువారం ప్రకటనలో పిలుపునిచ్చారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం నిరుపేదలు మండలంలోని పెద్దకొడపాక రెవెన్యూ శివారు సర్వేనెంబర్ 633 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గుడిసెవాసులకు పట్టాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.