
– 6 గ్యారంటీలపైనే కాంగ్రెస్ భవిష్యత్తు..
– కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపని రాహుల్ ప్రసంగం..
నవతెలంగాణ – వేములవాడ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారలో భాగంగా శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆది శ్రీనివాస్ ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ విచ్చేశారు.. ఆయన ప్రసంగంలో ఏదో వెలితి కనిపిస్తుంది కార్యకర్తలే చర్చించుకున్నారు. కర్ణాటకలో మాదిరిగానే ,తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు పథకాలపైనే కాంగ్రెస్ భవిష్యత్తు ఉన్నట్టుగా ఆయన ప్రసంగమంతా కొనసాగిందని కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను అమలు చేస్తామని తెలిపారు గాని అమలు చేయడానికి నిధులు ఏ విధంగా సమకూర్చుతారు అనేది మాత్రం తెలుపలేదు..వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు ఆయన ప్రసంగంతో జోష్ నింపుతారు అనుకుంటే ఆయన ప్రసంగంలో పసలేదని కార్యకర్తలే బహిరంగంగా మాట్లాడుకుంటూ తిరుగు పయనమయ్యారు.. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు, భద్రత సిబ్బందిని తొలగించారు కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారని తీవ్రంగా విమర్శించారు.. మోడీ చేతిలో కెసిఆర్ రిమోట్ కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసీఆర్ ను ఆయన చెప్పినట్లుగా ఆడిస్తున్నారు అంటూ ప్రతి అంశంలో కేసీఆర్ మోడీని విమర్శించడమే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందని ప్రసంగంలో లేదా అనేది కార్యకర్తలు భావనలో ఉన్నారు.ప్రతి అంశాన్ని మోడీకి ముడివేస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. రాహుల్ గాంధీ పర్యటన ఏంటిది ..ఆయన దేనికి వచ్చారు.. వచ్చి ఏమి మాట్లాడుతున్నారు అనేది పొంతన లేక కార్యకర్తలు పార్టీ అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు.