రేపటి నుంచి నల్ల పోచమ్మ ద్వితీయ వార్షికోత్సవం

నవతెలంగాణ-కోట్‌పల్లి
మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం రేపటి నుంచి జరగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం నుండి ఆదివారం వరకు 2 రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 1 న అమ్మ వారికి అభిషేకం, భజన కార్యక్రమాలు, 2న బోనాలు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమాలకు వివిధ గ్రామాల భక్తులు ప్రజలు హాజరు కావాలని కోరారు.