– ఫిర్యాదు చేసిన శ్రీ భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్-3 టాడి టాపర్స్
నవతెలంగాణ కంఠేశ్వర్
టిసిఎస్ 3 నిజామాబాద్ అధ్యక్షులు కొత్తూరు రవీంధర్ గౌడ్ సొసైటీ డబ్బులను దుర్వినియోగం చేస్తూ కార్మికులకు చేస్తున్న మోసాల పై శ్రీ భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్-3 టాడి టాపర్స్ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్-3 టాడి టాపర్స్ మాట్లాడుతూ..
భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్ -3 యొక్క ప్రస్తుత అధ్యక్షలు కొత్తూరు రవీంధర్ గౌడ్ భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్-3 యొక్క డబ్బులను కొందరు వ్యక్తులైన సేపూర్ స్వామిగౌడ్, సేపూర్ సుమన్ గౌడ్లు, సొసైటీకి సంబంధం లేని వ్యక్తులు అయిన సేపూర్ జయసింహ గౌడ్, బుర్ర శ్యాంసుందర్ గౌడ్, ఎస్. నాగరాజు గౌట్లతో కుమ్మక్కై సొసైటీ డబ్బులను వారికి ధారాదత్తం చేస్తూ వారితో పాటే పంచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులే యజమానులుగా డిపోను నడుపుతున్నామని బయటకు చెబుతూ కార్మికులకు మాత్రం గత సంవత్సరం నుండి కేవలం నెలకు రూ|| 4 వేలు మాత్రమే ఇస్తున్నారు అని తెలియజేశారు. వచ్చిన లాభాలను కార్మికులకు పంచకుండా అధ్యక్షులు సొసైటీలోని సేపూరు స్వామి గౌడ్, సేపూరి సుమన్ గౌడ్లతో కుమ్మక్కై సొసైటీ డబ్బులను కాజేస్తున్నారు అని తెలియజేశారు. కార్మికులకు ఎటువంటి సంబంధం లేకుండా డిపోలో కార్మికులకు చెందిన వాటాలను అక్రమంగా బయట వ్యక్తులకు లక్షల రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. టిసియస్-3 అధ్యక్షులు కే. రవీందర్ గౌడ్ సొసైటీ బైలకు విరుద్ధంగా వెళుతూ కార్మికులకు రావలసిన వాటాలను లాభాలను ఇవ్వకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని బయట వ్యక్తులకు అప్పజెప్పి అక్రమాలకు పాల్పడుతున్నందున విచారణ జరిపి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని, డిపో నిర్వహణలో అక్రమంగా చొరబడిన వ్యక్తులు సేపూరు జయసింహా గౌడ్, బుర్ర శ్యాంసుందర్ గౌడ్, ఎస్. నాగరాజు గౌడ్లను డిపోనుండి బయటకు పంపాలని, డిపోను కార్మికులే నిర్వహించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్సైజ్ సూపర్డెంట్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర లక్ష్మీ నరస గౌడ్, రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, తిరుమలేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.