నూతన డిఇవో గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మన జిల్లావాసి మనకు డిఇవోగా రావడం అభినందనీయమని, కుల గణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, పదో తరగతి ఫలితాలలో జిల్లా ను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి ఉపాధ్యాయులు కష్ట పడతారని డిఇవో అశోక్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు రవికుమార్, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కొట్టూరు రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు జె శ్రీనివాస్, విజయ్ కుమార్, రామకృష్ణ బిసిటియు రాష్ట్ర నాయకులు రమణస్వామి, కె బాబు, లింబయ్య తదితరులు పాల్గొన్నారు.