‘నాంది’ తర్వాత అల్లరి నరేష్‌, విజరు కనకమేడల మరో యూనిక్‌, ఇంటెన్స్‌ మూవీ ‘ఉగ్రం’తో వస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘దేవేరి’ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ, ”దేవేరి’ పాట రాసిన శ్రీమణికి, పాడిన అనురాగ్‌ కులకర్ణికి థ్యాంక్స్‌. శ్రీ చరణ్‌ చాలా బ్యూటీఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. విజరు మాస్టర్‌ చక్కని కొరియోగ్రఫీ చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడ కుండా నిర్మించారు. నా కెరీర్‌లో హయ్యెస్ట్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌. సమ్మర్‌లో మీ ముందుకు రాబోతుంది’ అని చెప్పారు.’శ్రీచరణ్‌ నేపథ్య సంగీతం ఇంకా అద్భుతంగా ఉంటుంది. నరేష్‌కి మరో డిఫరెంట్‌ ఫిల్మ్‌ కాబోతుంది. మిర్నా చక్కగా నటించింది’ అని దర్శకుడు విజరు అన్నారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల మాట్లాడుతూ, ‘ఇది చాలా డిఫరెంట్‌ మూవీ. సౌండింగ్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’ అని తెలిపారు.