– జేఏసీ వైస్ చైర్మన్ పుర్మ ఆగం రెడ్డి
నవతెలంగాణ – చేర్యాల
చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం గ్రామాల్లో క్షేత్రస్థాయి కమిటీలు వేస్తున్నట్లు జేఏసీ వైస్ చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి తెలిపారు. చేర్యాల పట్టణ కేంద్రంలోని వాసవి గార్డెన్ లో ఆదివారం చేర్యాల మండల స్థాయి జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జేఏసీ మండల కన్వీనర్ బొమ్మగాని అంజయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆగంరెడ్డి మాట్లాడుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని గత ఐదు సంవత్సరాలు గా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇంత ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ ఉద్యమ పోరాట తరహాలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం సకల జనులు ఏకమై రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యేంతవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు అందె అశోక్, టిడిపి మండల అధ్యక్షులు కూరారం బాల నరసయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ పర్పాటకం మాధవరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తడక లింగం గుప్తా, జిల్లా వెంకటేశం, బండారి సిద్దయ్య, దొడ్డిని నాగరాజు, బట్టి చంద్రయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి, మేడిపల్లి చందు, నంగి మైసయ్య, బొక్కల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.