మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత అందరిది

– ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే బాధ్యత అందరిదని, క్రీడాకారులలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాయి, సబ్‌ జూనియర్‌ బాలికల ఫుట్‌బాల్‌ క్రీడా పోటీలలోక్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఓటమిని, గెలుపు కోసం మెట్లుగా వాడుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో క్రీడల్లో రాణించి తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలన్నారు. స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు న్యాతకాని మల్లికార్జున్‌ క్రీడాకారులకు క్రీడా సామగ్రి అందజేశారు. నల్లగొండ సోషల్‌ వెల్ఫేర్‌, మైనారిటీ, గురుకుల పాఠశాలల విద్యార్థులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయా మండలాల నుండి ఎంపికకు హాజరయ్యారు. పీఈటీ గడసంతుల మధుసూదన్‌ ఆధ్వర్యంలో ఎంపిక నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే, ఈ ఫుట్‌బాల్‌ క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు మున్సిపల్‌ చైర్మెన్‌ వస్పరి శంకరయ్య క్రీడా దుస్తులు అందజేశారు. పీఈటీ గడసంతుల మధుసూదను అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ వస్పరి శంకరయ్య, వైస్‌ చైర్మెన్‌్‌ మొరిగాడి మాధవి వెంకటేష్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు, స్టాలిన్‌ బాబు, ఎంఈవో కష్ణ, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు, ఫ్రెండ్స్‌ క్లబ్‌ అధ్యక్షులు, పూల నాగయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు కుండే సంపత్‌ ,పత్తి వెంకటేష్‌, ముట కొండూరు జెడ్పిటిసి పళ్ళ వెంకటరెడ్డి, ముడకొండూర్‌ వైస్‌ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశం,జిల్లా ఆర్టిఏ సభ్యులు పంతం కష్ణ, ఆత్మ చైర్మన్‌ జల్లి నరసింహులు,ఆలేరు మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్‌ భేతి రాములు,మోర్తాల సునీత రమణారెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కూళ్ల వెంకటేష్‌, జూకంటి ఉప్పలయ్య , పిఇటీ లు , నిర్మల, స్థానికులు కోటగిరి ఆంజనేయులు, శివమాలు, శ్రీలత, రేణుక,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.