ఎమ్మెల్యే ఆదేశానుసారం బూతు స్థాయి కమిటీ ఏర్పాటు

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలో ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి ఆదేశానుసారం బుధవారం బూతు కమిటీలను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం సరోజ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులులింగారెడ్డి, మాజీ సర్పంచ్ బియాంక్ గణేష్, ఎంపీటీసీ ఉప్పునూతల అనూష శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, లోక ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.