చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన విద్యానగర్ కమిటీ సభ్యులు

నవతెలంగాణ-  ఆర్మూర్
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల విద్యానగర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి కాలనీవాసుల ఆహ్వాన మేరకు ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుండి 25 లక్షలు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏకాగ్రీవ తీర్మానం చేసినారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ దంపతులకు కమిటీ సభ్యులు సన్మానించినారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.