నవతెలంగాణ-మోపాల్
నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్ర ఆలయంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, అలాగే సాంప్రదాయ బద్దంగా కోలాహాలంగ వేడుకలను నిర్వహించిన ఆలయ ప్రధాన ధర్మకర్త ఇందూరు అన్నమయ్య నర్సింహారెడ్డి. గోపూజ అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలో మూడు జట్లు పాల్గొన్నాయి. ఈ సంవత్సరం జట్టు ఉట్టినికొట్టి మొదటి బహుమతిని పొందింది. అర్చక స్వాములు సంపత్ కుమారాచార్య, రోహిత్ కుమారాచార్య క్రతువును నిర్వహించారు. దిల్ రాజు రావడంతో మరింత కులాహలంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి, కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిల్ రాజు దంపతులు, బలగం నటుడు మైమ్ మధు, ఇందూరు అన్నమయ్య నర్సింహా రెడ్డి దంపతులు, బలగం సినీ నిర్మాత హర్షిత్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు, సర్పంచ్ సాయిరెడ్డి, రవింధర్ యాదవ్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రాజేశ్వర్, సినీ నటులు రవి, సాయిలు, అశోక్ తదితరులు పాల్గొన్నారు