చాకలి ఐలమ్మ జీవితం చిరస్మరణీయం: గొల్లపల్లి సర్పంచ్

నవ తెలంగాణ – రేవల్లి
భూస్వామ్య వ్యతిరేక పోరాటాల వీర వనిత, చాకలి ఐలమ్మని, ఈరోజు, ఐలమ్మ వర్ధంతి సందర్భంగా, గొల్లపల్లి గ్రామ సర్పంచ్ సునీల్ కుమార్ గారు, ఒక కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామ వాస్తవ్యులైన ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతులకు ఐలమ్మ జన్మించింది. పదకొండు సంవత్సరాల చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వివాహం అయిన తరువాత ఐలమ్మ పేరు చిట్యాల ఐలమ్మగా మారింది. వృత్తిపరంగా రజక కులానికి చెందిన వనిత కావడంతో తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి ఈమె పేరు “చాకలి ఐలమ్మగా” ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా కీర్తించబడిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రేవల్లి మండల కేంద్రంలో, చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత. సామాజిక, ఆధునిక, పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి.  తెలంగాణ తెగువకు చిరునామా, మహిళా లోకానికి స్ఫూర్థి, అని ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక కమిటీ అధ్యక్షులు, సిమర్ల వెంకటస్వామి, మండల రజాకా రిజర్వేషన్ల అధ్యక్షులు దాసరి రాజుల శ్రీనివాసులు, జెడ్పిటిసి భీమన్న, బిఆర్ఎస్ సీనియర్ నేత శివరాం రెడ్డి, పరుశరాం, వెంకటయ్య, శివ, ప్రవీణ్ కొందరు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.