ఒక్క అడుగు స్వచ్ఛత వైపు

నవతెలంగాణ-పెద్దగుండవెళ్ళి :పెద్దగుండవెళ్ళి లోమహాత్మా గాంధీ జయంతి  పురస్కరించుకు నెహ్రూ యువ కేంద్రం  పిలుపుమేరకు రామసేన యూత్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పెద్దగుండవెళ్ళి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘన నివాళులర్పించారు.అనంతరం గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు.  ఈ సందర్భంగా  కార్యక్రమా  సమన్వయకర్త చెపురి సాయికుమార్  మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని పరిశుభ్రత ద్వారా వారు ఆకాంక్షించారు అని, “ఒక్క అడుగు స్వచ్ఛత వైపు” అంటూ యువత ముందుకు సాగాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి ఒక దేశం లోనే అతి పెద్ద ఉద్యమంగా దీనిని నిర్వహించడం సంతోషకరమని, పరిశుభ్రమైన భారతం నిర్మాణ దిశగా యువకులు స్వచ్ఛ భారత్ నిర్వహించాలని ప్రతి పౌరుడు విధిగా స్వచ్ఛత పరిశుభ్రత గా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా అందరూ ఫిట్ గా ఉండడం కోసం రోజు వ్యాయామం యోగ ఆసనాలు చేయాలని ఆరోగ్య భారతంగా నిర్మించాలని వారు అన్నారు. కార్యక్రమంలో యువజన సంఘ సభ్యలు బాయికాడి లక్ష్మణ్ నవీన్ రెడ్డి, సన్నీ, బన్నీ, రాహుల్ ,వంశీ పాల్గొన్నారు.