
కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నునావత్ గణేష్ నాయక్ ఎన్నికైనందుకు తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గణేష్ నాయక్ డైరెక్టర్ గా ఎన్నికైనందుకు డాక్టర్ తేజావత్ బెల్లయ్య ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్, జిల్లా వైస్ చైర్మన్ నరేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.