
మండల కేంద్రంలోని బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో నర్సరీ క్లాసులో చదువుతున్న చిన్నారులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. వజ్రాసనం వృక్షాసనం పద్మాసనం తదితర ఆసనాలను పతంజలి యోగ గురూజీ జంగల్ సుధాకర్ చేయించగా అద్భుతంగా యోగ ఆసనాలు చేయడం అందరిని అబ్బురపరిచింది. ఈ సందర్భంగా పతంజలి యోగ గురుజి సుధాకర్ మాట్లాడుతూ.. యోగాసనాల వలన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతి ఒక్క రూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని అలాగే రా ఫుడ్ తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్య ఉండదని నొక్కి చెప్పారు ఈ యోగా సాధనలో పాల్గొన్న చిన్నారులు రియాన్స్ పిచ్చుకల, బన్నీ, బట్టు, శివాని రాకేష్ వినూత్న తదితర బాలికలు పాల్గొన్నారు.