నవతెలంగాణ – మాక్లూర్
గర్భస్థ తల్లులు పోషనంపదర్థలు తీసుకోవాలని, దాని ద్వారా పొట్టిన పిల్లలు దృఢంగా ఉంటారని శిశు సంక్షేమ అధికారి రసూల్ బి తెలిపారు. శనివారం మండలంలోని అమ్రాద్ గ్రామంలోని రైతు వేదికలో ఆంగాన్ వాడి కేంద్రాల అధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లలకు చిన్ననాటి నుంచే మంది విషయాలు నేర్పలన్నారు. గర్భిణీలు పోషక పదార్థాలు, అకు కూరలు, పండ్లు తీసుకోవడం వల్ల పిల్లలు దృఢంగా పుడుతరని తెలిపారు. పిల్లలకు తల్లి పాలు ఎంతో ముఖ్యమని వివరించారు. ఎంపీడీఓ క్రాంతి మాట్లాడుతూ సమాజంలో మహిళ పాత్ర చాలా ముఖ్యమైనది. మహిళ మరణాలు ఎక్కువ అవడంతో 1975లో అంగన్ వాడి వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. మహిళలకు, పిల్లలకు మంచి ఆహార పోషణ అందించడంలో ఆంగన్ వాడిలు ముఖ్యం పాత్ర పోస్తున్నాయని, మహిళల్లో ఉన్న ప్రేమ, సహనం, ఓర్పు, పిల్లలకు అందించాలనీ, వసతులు ఉన్న లేకున్న మి బాధ్యత మీరు చేస్తున్నారన్నారు.. మీకు కావల్సిన సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. శారీరక పోషణతో పాటు సామాజిక పోషణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వర్ణలత, బల రక్షణ కో ఆర్డనేటర్ విజయ, తహల్దర్ షబ్బీర్, డిప్యూటీ తహశీల్దార్ పద్మ, ఏ ఎసై నర్సయ్య, సూపర్ వైజర్ శ్రీ ప్రియ, వరలక్ష్మి, సరిత, సునీత, అంగన్ వాడి టీచర్లు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.