
మండల కేంద్రంలోని అంగన్ వాడి కేంద్రం 3లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లులకు వెయ్యి రోజుల గురించి వివరించారు. గర్భవతులు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, పిల్లలకు తల్లి పాలను అందించాలని సూచించారు. హ్యాండ్ వాస్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు రజత, నసిమ, అంజిలి, భారతి, పిల్లలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు.