
మండలంలోని అంకాపూర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ లో భాగంగా, గర్భిణీ కి శ్రీమంతం ,.రక్తిహీనత రాకుండా మంచి పోషకాహారం తీసుకోవాలని, నార్మల్ డెలివరీ అయినట్లయితే, ముందు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలుపుతూ కార్యక్రమం నిర్వహించినట్టు ఏసీడీపీఓ జ్యోతి గురువారం తెలిపారు.. బరువు తక్కువగా ఉన్న పిల్లలకు బాలామృతం+ తో పాటు మంచి పోషకాహారం ఇవ్వాలని, న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్, నిజామాబాద్ కి పిల్లలని తీసుకెళ్తే ఆరోగ్యానికి సంబంధించిన పిల్లల కి పోషకాహారం ఎలా ఇవ్వాలో తెలియజేస్తారు.అంగన్వాడిలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడి టీచర్ లక్ష్మి, చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు .