అంగన్ వాడి కేంద్రంలో పోషణ మాసం

నవతెలంగాణ-భైంసా : పట్టణం లోని భైల్ బజార్ అంగన్ వాడి కేంద్రం 3 లో పోషణ మాస కార్యక్రమ న్ని జరుపుకున్నారు. గర్భిణీలకు, బాలింత లకు పోషక ఆహారం పై అవగాహన కల్పించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు పోషక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అదేవిధంగా బరువు తక్కువ ఉన్న పిల్లలకు పోషక ఆహార ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో అంగన్ వాడి ఉపాధ్యాయురాలు టి.అర్చన ప్రభుత్వ వైద్యురాలు ఫిర్దోస్ జాబిన్, ఆశా వర్కర్ రసిక,మౌనిక లు పాల్గొన్నారు.