దుంపెల్లి గూడెం లో పోషణ మాసోత్సవం

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపెల్లి గూడెం గ్రామంలో ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ దీప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలింతలకు కిశోర బాలికలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారము పరిశుభ్రత తల్లిపాలు ప్రాధాన్యత తదితరాంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పి సరిత వి సుగుణ టి శ్వేత బి అరుణ దీప్తి డి శిరీష తదితరులు పాల్గొన్నారు.