మామిడిపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాలు

నవతెలంగాణ – ఆర్మూర్  

పోషణా పక్షం కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి-6 అంగన్వాడీ కేంద్రంలో పలు కార్యక్రమాలు నిర్వహించినారు. సి.డి.పి.ఓ. భార్గవి ఆదేశానుసారం గర్భిణీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, తల్లిపాల పై అవగాహన, చిరుధాన్యాలు నిత్యం జీవితంలో ఒక భాగం కావాలని, పోషకాల తో కూడిన వంటల గురించి తెలియజేస్తూ, 3-6 సం. పిల్లలని అంగన్వాడీ కి పంపిఃచాలని, వారికి పోషకాహారం తో పాటు ప్రీ- స్కూల్ విద్య చెప్పడం జరుగుతుంది అని ఏ సి డి పి ఓ ఆర్ జ్యోతి తెలిపారు., ప్రీ స్కూల్ పిల్లల అభివృద్ధి కార్డులను వారి పేరెంట్స్ కి ఇవ్వడం జరిగింది అని తెలిపారు ..ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఏ శ్రీదేవి, టీచర్లు జగదాంబ, గోదావరి, సంగీత, శైలజ, రజిని, పద్మ, లక్ష్మి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.