దండిగుట్ట అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలు…

నవతెలంగాణ- రెంజల్ 
రెంజల్ మండలం దండిగుట్ట అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులతోపాటు గర్భిణీ బాలింత మహిళలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించి నట్లు ఆమె తెలిపారు. గర్భిణీ బాలింత మహిళలకు ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలని ఆమె సూచించారు. చిన్నారులకు ఆటపాటలతో పాటు బాలమృతం తప్పకుండా అందించాలని అంగన్వాడీ టీచర్  ఆదేశించారు. ఎత్తు బరువు కొలతల ప్రకారం చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. మహిళలు తమ ఇంటి పరిసర ప్రాంతాలలో ఆకుకూరలు కాయగూరలు తోటలను పెంచాలని ఆమె సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించి పూల మొక్కలు, ఆకుకూరలు పండించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజమణి, గర్భిణీ బాలింత మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.