
మండలంలోని ఖానాపూర్ వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా అంగన్ వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ తల్లి పాల గురించి, గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పిల్లల బరువుల గురించి అవగాహన కల్పించి, సర్వేపల్లి జయంతి కార్యక్రమం సైతం నిర్వహించినారు ..ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కిషన్ రెడ్డి ,అంగన్వాడి టీచర్ మమత ,చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.