నవతెలంగాణ – నసురుల్లాబాద్
పోషకాహారం లోపించకుండా ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి తెలిపారు. శుక్రవారం మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడుతూ పాడుతూ నీతి కథలు వింటూ పాఠాలు నేర్చుకుంటున్నారు. మూస విధానంతో కొనసాగే బోధనకు స్వస్తి పలుకుతూ చిన్నారుల్లో ఆలోచనలు రేకెత్తిస్తూ, మేధోశక్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. మహిళలు గర్భిణి స్త్రీలు పోషకాహారం తీసుకోవాలన్నారు. ముఖ్యముగా మన ఆహార పదార్ధాలలో రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, కొర్రలు మొదలైనవి అన్నీ వుండేటట్లు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.