
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పోషణ ఆహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని బాలింతలు గర్భిణీలు, కిషోర్ బాలికలు తప్పకుండా వాడితే ఆరోగ్యంగా ఉంటారని పౌష్టికాహారం సక్రమంగా తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ ఎంపిటిసి సభ్యురాలు సంగీత సిడిపిఓ తో పాటు సూపర్వైజర్లు కొమ్మరవ్వ, కవిత, మదూర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణిలు, బాలింతలు, కిశోర బాలికలు, తల్లులు పాల్గొనడం జరిగింది.