విద్యార్థులకు పౌష్టికమైన భోజనాన్ని అందజేయాలి

– అదనపు కలెక్టర్ అంకిత్
నవతెలంగాణ  – భీంగల్
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న  పౌష్టికంగా అందజేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు, నిరువావులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన  మహోత్సవంలోని పచ్చదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను, మైనార్టీ పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అంకిత్ సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలలో అపరిశుభ్రతకు తావివ్వకుండా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అలాగే మధ్యాహ్న భోజన ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధి జనాన్ని అందజేయాలని  అధికారులకు, నిర్వాహకులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మైనార్టీ పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణ, ఎంఈఓ స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలతో సురేందర్, వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు,  వార్డు ఆఫీసర్లు, మెప్మా ఆర్ పి లు  ఉన్నారు.