నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ పాలన గాడి తప్పిందనీ, మంత్రుల పేషీల్లో అధికారుల కాలక్షేపమే దానికి ప్రత్యక్ష ఉదహరణ అని బీజేపీ మీడియా ఇన్‌చార్జి ఎన్వీ సుభాశ్ విమర్శించారు. సీఎంతో పాటు మంత్రులు పెట్టు బడుల పేరుతో సొంత వ్యాపారాలను పెంచుకునేందుకు అమెరికా పర్యటన లో మునిగితేలుతున్నారనీ, అధికారు లేమో ఇక్కడ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎనిమిది నెలల కాలంలో రేవంత్‌రెడ్డి సర్కారు రూ.50 వేల కోట్ల అప్పు చేయడం దారుణమని పేర్కొ న్నారు. బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల పేరుతో వెయ్యి కోట్ల రూపా యలు సేకరించిందని తెలిపారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శ్రీలంక లోని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ప్రభుత్వ గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేవనీ, పిల్లలు విషజ్వరాలతో చనిపోతున్నారని వాపోయారు. ప్రజా పాలన గాడి తప్పిం దని విమర్శించారు.