ఓ అంబేద్కరా….!
నీ ముసుగు తొడుగై
మాటలు నేర్సిన సిలకలై
వీది వీదిలో వాదనల వాదులై
అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలిగే
భ్రమ జీవులై….
అగ్రకులాలో ఒక్కని తిడుతూ
మరోకరిని పొగుడుతున్న చెంచాగాల్లై
కొంతమందిని కూడగట్టుకొని
కోట్లు దండుకునే దోపిడీ దొంగలై
రాజకీయ ఎన్నికలలో
ఓట్లను తాకట్టు పెట్టే ఏజెంట్లై
జయంతి, వర్దంతులకు దండలు వేసి
దండం పెట్టి జారుకునే దరిద్రులకే
మీ ఆశయం ఒక అవకాశ వాదం
మీ త్యాగం తాకట్టు మయం
మనస్పర్ధలతో పట్టరాని ఈగోలతో
జనసంద్రాన్ని చీల్చుకుంటూ
బహుజన వాదం ఎత్తుకుంటారు
ఇదేనా…మీరు కోరుకున్నది
ఇదేనా… మీరు ఆశించిన్నది.
– అక్షర జ్వాల, 9010483021