స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఐ వేర్ లో గ్లోబల్ లీడర్ గా ఉన్న బ్రాండ్ ఓక్లీ

నవతెలంగాణ హైదరాబాద్: ఇప్పటికే ఎంతో అద్భుతమైన స్పోర్ట్స్ ఐవేర్ ను రూపొందిస్తున్న ఓక్లీ ఇప్పుడు తాజాగా తన యొక్క లేటెస్ట్ చాప్టర్, ఎంతో ప్రేరణతో కూడిన ‘బి హూ యు ఆర్’ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ను ఇండియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రారంభించారు. ఇండియన్ క్రికెట్ టీమ్ కు నాలుగోసారి ప్రపంచ కప్ అందించేందుకు సిద్ధమవుతున్న రోహిత్ శర్మకు ఇవే మా శుభాభినందనలు.

ఓక్లీతో రోహిత్ శర్మ యొక్క 5 ఏండ్ల అనుబంధాన్ని సూచిస్తుంది ఈ సరికొత్త క్యాంపెయిన్ సూచిస్తుంది. అథ్లెట్లు అత్యున్నత స్థాయిలో ఆడటానికి మరియు వారి నిజమైన, ప్రామాణికమైన వ్యక్తిగా ఉండటానికి మద్దతు ఇవ్వడానికి బ్రాండ్ యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది.
ఈ సరికొత్త ప్రకటన అథ్లెట్ ప్రయాణం యొక్క ప్రామాణికత, అభిరుచి మరియు స్వీయ-నమ్మకాన్ని నిరూపిస్తుంది. ఇక క్యాంపెయిన్ విషయానికి వస్తే.. ఓక్లీ తరపున రోహిత్ శర్మ తన కథనాన్ని వివరిస్తాడు. తన కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న “హిట్‌మాన్”తో ప్రకటన ప్రారంభమవుతుంది, భవిష్యత్తులో అథ్లెట్లు తమ ఇన్నర్ వాయిస్ ని విశ్వసించేలా మరియు అందరికి స్ఫూర్తిని అందించేలా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకున్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టే ముందుకు నడిపించేలా ప్రోత్సహిస్తుంది. ఈ క్యాంపెయిన్ లో రోహిత్ ఉండడం ద్వారా, ప్రకటన అనేక దృశ్యాలను మరియు కోణాలను వివరిస్తుంది. రోహిత్ క్రీడాకారులను వారి లక్ష్యాలను సాధించేలా ప్రేరేపిస్తున్నాడు. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం మరియు భారతదేశంలో క్రీడలు మరియు చురుకైన జీవనశైలిని ఉన్నతీకరించడానికి ఓక్లే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా భారతదేశంలో అధ్లెట్స్ మరింతగా రాణించాలనే దృడ సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఓక్లీ మిషన్‌లో ఇది అంతర్భాగం.

“రోహిత్ శర్మతో ఓక్లీ యొక్క భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు మా ‘బి హూ యు ఆర్’ ప్రచారానికి సంబంధించిన తాజా అధ్యాయాన్ని ఆవిష్కరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓక్లీ మానవ సంబంధాలను మరింత ప్రాధాన్యతను ఇస్తుంది. అలాగే క్రీడల వైపు కూడా. ప్రతీ ఒక్కరి జీవితంలో ఈ రెండూ హైలైట్ అవ్వాలని ఓక్లీ బలంగా నమ్ముతుంది. అథ్లెట్ యొక్క ప్రతిభపై మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు నాయకుడిగా మరియు సానుకూల రోల్ మోడల్‌గా వారి పాత్రపై కూడా దృష్టి సారించాలి అని అన్నారు ఓక్లీ ఇండియా సీనియర్ బ్రాండ్ బిజినెస్ మేనేజర్ సాహిల్ జాండియాల్.
ఈ సందర్భంగా క్యాంపెయిన్ గురించి ఇండియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. “ఈ  “బి హు యు ఆర్” క్యాంపెయిన్ ద్వారా మేము రాబోయే తరాల క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపాలని అనుకుంటున్నాము. తద్వారా వాళ్లు తమ యొక్క శక్తిని నమ్ముకుని వారి సామర్థ్యానికి మరింత మెరుగులు పెట్టుకుని తమ తమ విభాగంగా అద్భుతంగా రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే నేను ఎలా సాధించానో వారు కూడా అలాగే సాధించాలని, తాము కన్న కలలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓక్లీతో జతకట్టడం ద్వారా, నేను నా తర్వాతి తరానికి గెలుపు ఒక్కటే అంతిమం కాదని చెప్తున్నాను. ఆ గెలుపు అనేది ఎలా ఉండాలంటే మనం ఏ భూభాగంలోనైనా, ఏ రంగంలోనైనా మరియు ఏ క్రీడలోనైనా స్వశక్తిని నమ్ముకుని గెలిచి భావి తరాలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
లేటెస్ట్ క్యాంపెయిన్ లో రోహిత్ శర్మ బ్రాండ్ యొక్క కొత్తగా రూపొందించిన గ్లాసెస్ – స్ఫేరా మరియు బిస్ఫేరాను లాంచ్ చేశారు. ఈ రెండు గ్లాసెస్ క్రీడల్లోల పోటీపడే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది, రాబోయే ఒలింపిక్స్ 2024లో ప్రకటన చేయడానికి రెండు గ్లాసెస్స సెట్ చేయబడ్డాయి. అథ్లెట్ల కఠినమైన అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఈ గ్లాసెస్… ఓక్లీ యొక్క విభిన్న స్పోర్ట్స్ లైనప్‌లోని ఉత్తమ అంశాలను ఒకచోట చేర్చాయి. ఓక్లీ యొక్క అత్యంత నాణ్యత కలిగిన ఈ గ్లాసెస్ ధరించినప్పుడు.. అసలు బరువులేని, కళ్లపై చాలా లైట్ గా ఉండే అనుభూతిని అందిస్తాయి.
ఓక్లీ కోసం ఈ క్యాంపెయిన్ ని బ్రాండ్‌మూవర్స్ ఇండియా రూపొందించింది. ఈ సందర్భంగా బ్రాండ్‌మూవర్స్ ఇండియా ఎండీ & చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ సువజ్యోతి ఘోష్ మాట్లాడారు. “రోహిత్‌తో మా సంవత్సరాల అనుబంధంలో, అతను అత్యంత విజయవంతమైన క్రీడాకారుడిగా ఎదగడం మరియు అభివృద్ధి చెందడం మేము చూశాం. ఈ ప్రపంచంలో. అతని విజయాలు చాలా గొప్పవి మరియు అవి కష్టపడి సంపాదించినవి – అతను ఒక ప్రేరణ. అందుకే ఈ ఏడాది మా ప్రచారం కోసం మేము అతన్ని విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నించాం అని అన్నారు

ధర వివరాలు: స్ఫేరా రూ.12,990/- మరియు బిస్ఫేరా రూ. 11,490/- నుండి ప్రారంభమవుతుంది

అందుబాటు వివరాలు:

ప్రముఖ ఆప్టికల్ స్టోర్‌లు, సన్‌గ్లాస్ హట్, లెన్స్‌ క్రాఫ్టర్స్ మరియు Amazon, Myntra, AJIO మరియు Tata CliQ లగ్జరీ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

ఓక్లీకి సంబంధించిన మరింత సమాచారం కోసం సంప్రదించండి:Oakley.com