
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ జాబితాలపై ఈనెల 14 నుండి 21 వరకు అభ్యంతరాలు ఆక్షేపణం ఉన్నట్లయితే గ్రామపంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని ఇన్చార్జి ఎంపీడీఓ మాధవరెడ్డి తెలిపారు.గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం లో వివిధ రాజాకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామపంచాయతీ మండల అభివృద్ధి కార్యాలయంలో జాబితా ప్రదర్శించడం జరిగిందని అట్టి జాబితా పై అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే ఈనెల 21లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని తెలిపారు. పార్టీ అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 26 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఫోటో ఎలక్ట్రాన్ జాబితాను ఈనెల 28న ఆయా గ్రామపంచాయతీ మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. మండలం లో ఇంటింటి సర్వే నిర్వహించి ఓటరు జాబితా సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగింపు, అడ్రస్ చెంజ్ ఆన్లైన్లో వచ్చిన ఫామ్స్ ని విచారణ చేసి ఐటి టూల్స్ ద్వారా సరిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.