గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలన

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణంలోని శాకారి కుంటలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను తాసిల్దార్ శివ ప్రసాద్, సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ సాయికుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ కు సూచించారు. పంచాయతీ సిబ్బంది నిమజ్జన సమయంలో చెరువుల వద్ద ఉండి సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు.